వైద్య నిపుణులు అందుకే ఎక్కువ శాకాహారం తీసుకోమని అంటున్నారు. కూరగాయలు, పండ్ల లో ఎక్కువ పోషక విలువలు ఉండటం వల్ల జీవిత కాలంను పెంచే మార్గాలు కూడా వీటిలో ఎక్కువగా వుంటాయి అని అన్నారు. అలానే కూరగాయలు అధిక శాతం ఫైబర్ లను కూడా కలిగి ఉంటాయి. దీని మూలం గానే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఇవి తోడ్పడ్డాయి.
నేటి కాలం లో చాలా మంది డయాబెటిస్ తో సతమతం అవుతున్నారు. ఇలా బాధ పడేవారు శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ శాతం అదుపులో ఉంటుంది. అంతే కాకుండా మన శరీర చర్మం సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువగా పండ్లను,కూరగాయలను తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు తెలిపారు. మనం తీసుకునే ఆహార పదార్థాలను ఎక్కువ జంక్ ఫుడ్ ను కాకుండా వెజిటేరియన్ ఫుడ్ ని తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురు కావు. చూసారా వెజిటేరియన్ ఫుడ్ ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు . దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు అనేక సమస్యల నుండి ఎంతో సులువుగా మనం బయట పడే వీలు కూడా ఉంది. కనుక శాకాహారం తీసుకుని ఫిట్ గా ఆరోగ్యంగా ఉండండి .