అదే సమయంలో భారత సైనికులు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ... ఏకంగా చైనా వ్యూహాత్మక ప్రదేశాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటూ ఉండటం... చైనా కు మరింత షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే చైనా మిత్ర దేశంగా ఉన్న పాకిస్తాన్ కూడా చైనాతో యుద్ధం తలెత్తితే జోక్యం చేసుకునే అవకాశం ఉందని భారత్ భావిస్తున్న విషయం తెలిసిందే. లేదా రెండు దేశాలు కలిసి ఒకేసారి భారత్ తో యుద్ధం ప్రకటించిన ఆశ్చర్యపోనక్కర్లేదని భారత రక్షణ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాతో యుద్ధం చేయాల్సి వస్తే చేయడంతో మాత్రమే కాదు పాకిస్తాన్ తో కూడా తప్పదు అని భావిస్తుంది భారత్.
అయితే తాజాగా ఇదే విషయాన్ని ఎయిర్ చీప్ మార్షల్ బదౌరియా వెల్లడించారు. పాకిస్తాన్ చైనా దేశాలు ఒకేసారి భారత్ పై యుద్ధానికి వచ్చిన... ఆ రెండు దేశాలకు సరైన బుద్ధి చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని అంటూ చెప్పుకొచ్చారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కేవలం లడక్ ప్రాంతంలో మాత్రమే కాకుండా ఎల్ఏసీ ప్రాంతంలో కూడా భారీగా సైన్యాన్ని మొహరించాము అంటూ ఆయన చెప్పుకొచ్చారు. భారత అమ్ములపొదిలో రఫెల్ యుద్ధ విమానాల చేరికతో సరిహద్దుల్లో శత్రువుల కంటే ఎంతో శక్తివంతంగా మారాము అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. మరిన్ని రఫెల్ జట్ల కొనుగోలుకు ప్రతిపాదనలు ఉన్నాయి అంటూ తెలిపారు.