అయితే మంగళ సూత్రం అంటే సాధారణంగా మూడు పోగుల దారాన్ని మొత్తం మూడు వరుసలు కలుపుతారు. అప్పుడు తొమ్మిది అవుతాయి. ఇలా తొమ్మిది పోగుల్ని మూడు వరుసలు వేస్తె ఇలా ఇరవై ఏడు పోగులు అవ్వగా.... దానిని స్త్రీ మెడ లో వేస్తారు. ఇరవై ఏడు పోగుల దారానికి రెండు సూత్రాలు కలిగి ఉంటాయి. ఆ సూత్రాలలో ఒక సూత్రం అమ్మ గారని మరో సూత్రాన్ని అత్త గారిని పిలుస్తారు.
అలానే మెడలో ఉన్న రెండు సూత్రాల్లో ఒక సూత్రం భార్య అని మరొకటి భర్త అని కూడా అంటారు. అలానే ఈ తాళిని తాళిమి గా కూడా భావించి కొలవడం జరుగుతుంది. తాళిమి కి అర్ధం ఏమిటంటే ఓర్పు అని. అంటే ఇప్పుడు ఏ కష్టము ఎదురైనా, ఆపద సంభవించినా కుటుంబాన్ని తన సంరక్షణ లో జాగ్రత్తగా చూసుకుంటుంది భార్య. పెద్దలు అందుకే భార్యను భరించేది అని అంటూ ఉంటారు. ఇలా తాళి లో చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి కనుక తెలుసుకోవడం ఎంతో మంచిది.