ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పడిలా  కాకుండా ప్రస్తుతం దొంగలు వినూత్నంగా  ఆలోచిస్తున్నారు. మామూలుగా అయితే ఒకప్పుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో తలుపులు బద్దలు కొట్టుకుని ప్రవేశించే వారు ఇక  అందినకాడికి దోచుకో పోయేవారు . కానీ ప్రస్తుతం దొంగలు మాత్రం ఎంతో తెలివిగా ఆలోచిస్తున్నారు. ఇంట్లో యజమానులకు నమ్మకస్తుడుగా మారి.. ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడ ఉంటాయో అని పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎవరికి అనుమానం రాకుండా దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు పోలీసులకు సవాల్ గా  మారుతున్నాయి.



 ముఖ్యంగా ఎంతో మంది డబ్బు ఉన్న వారిని టార్గెట్ గా చేసుకొని వాళ్ళ ఇంట్లో పనికి కుదురుతారు.  కొన్నాళ్లపాటు  ఎంతో నమ్మకంగా పని చేస్తారు. చివరికి ఇంట్లో యజమానులకు తమపై నమ్మకం కుదిరిన తర్వాత సరైన సమయం  చూసి ఇల్లుని  మొత్తం గుల్ల చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో వెలుగులోకి ఇలాంటి తరహా లోనే ఉన్నాయి. చివరికి నమ్మకస్తుడు అనుకుంటే ఇంట్లో పనిచేసే వాళ్లు చేసిన పనికి యజమానులు షాకవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పనివాడిగా చేరి ఆ ఇంటికే కన్నం వేస్తాడు ఇక్కడొక కేటుగాడు. దీంతో ఇంటి యజమాని  ఒక్కసారిగా అవాక్కయ్యారు.




 ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం ప్రాంతంలో చోటు చేసుకుంది. మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 10 నెలల క్రితం నేపాల్ కి చెందిన రవి అనే వ్యక్తి పనిలో చేరాడు. ఇక ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఎంతో నమ్మకంగా పని చేశాడు. అంతలోనే రవికి తెలిసిన మరో ముగ్గురిని కూడా అదే ఇంట్లో పని ఇప్పించాలంటూ యజమాని దగ్గరికి తీసుకురాగా నమ్మకస్తుడైన వ్యక్తి తీసుకురావడంతో వారికి కూడా యజమాని పని కల్పించాడు. ఇక ఆ తర్వాత అసలు ప్లాన్ అమలు చేశాడు. ముగ్గురూ కలిసి ఆహారం లో మత్తు మందు కలిపి పెట్టడంతో అది తిన్న ఇంటి యజమాని సహా కుటుంబ సభ్యులందరూ మత్తులోకి జారుకున్నారు. ఇక ఆ తర్వాత నలుగురు ఇంట్లో ఉన్న 40 లక్షల నగదుతో పాటు 5వేల బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత తేరుకున్న యజమానికి వెంటనే పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: