వైఎస్ జగన్ సర్కారు విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో విద్యాశాఖకి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యతనిచ్చి జగనన్న గోరుముద్ద, అమ్మఒడి, నాడు-నేడు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. విద్యాశాఖలో సంక్షేమ పథకాల ద్వారా డ్రాప్ అవుట్స్‌ని తగ్గించడం, ప్రాథమిక స్ధాయి నుంచే అత్యుత్తమ విద్యని అందించడమే లక్ష్యంగా పనిచేస్తుండటం ప్రభుత్వ పనిచేస్తోంది. ఇందులోనూ ఇది పేద విద్యార్థులకు సంబంధించిన మంచి పథకాలు.


ఈ పథకాలపై ఓ పత్రికగా నాలుగు మంచి మాటలు రాస్తే సంతోషమే.. లేకపోతే.. అలా వదిలేయొచ్చు. కానీ.. ఇలాంటి మంచి పథకాలపై కూడా బురద జల్లడం ఆంధ్రజ్యోతి వంటి పత్రికకే చెల్లింది. ఇదేమీ కొత్త పథకం కాదు.. అంతకు ముందు కూడా పుస్తకాలు, యూనిఫారములు, బూట్లు ఇచ్చారు.. ఏదో ఒకటి, రెండు అదనంగా చేర్చి ఈ జగన్ దానికి అనవసరంగా ప్రచారం చేసుకుంటున్నాడంటూ ఓ బురద చల్లే కథనం రాసుకొచ్చింది. ఆ కథనంలో జగన్ సర్కారుకు ఎక్కడ పేరొస్తుందోనన్న కడుపు మంట తప్ప.. ఇంకేమీ కనిపించలేదు.  


నిజమే.. అందులో కొన్ని గతంలోనూ ఇచ్చారు.. ఎవరు కాదన్నారు.. కానీ వాటికి ఇంకా అదనంగా చేర్చి అవన్నీ ఒకేసారి విద్యార్థులకు అందిస్తున్నారు. అందులో తప్పేముంది.. మంచిదే కదా. దానికి ఎందుకు బురద జల్లే కథనం.. అంటే.. దీనికీ ఓ కారణం ఉంది. అదేంటంటే.. ఈ విద్యాకానుక కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జగన్ సర్కారు.. పత్రికల్లో భారీగా ప్రకటనలు ఇచ్చింది. తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక ఈనాడు, తన సొంత పత్రిక సాక్షికి ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చింది.

యథా ప్రకారంగా ఆంధ్రజ్యోతికి మాత్రం మొండి చేయి చూపింది. అందులోనూ జగన్ సర్కారు ఇది దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా చేస్తున్నామని ఆ ప్రకటనల్లో తెలిపింది. అందుకే ఆంధ్రజ్యోతికి మండింది. అబ్బే ఇలాంటివి ఢిల్లీ, కేరళ కూడా చేస్తున్నాయి తెలుసా అంటూ ఆ కడుపు మంట కథనంలో రాసేసింది. మరి నిజమే కదా.. ఆ పత్రికకు కూడా ఓ ప్రకటన ఇవ్వొచ్చు కదా.. !

మరింత సమాచారం తెలుసుకోండి: