జగన్ కి అన్ని విధాలా సపోర్ట్ ఇచ్చి చంద్రబాబు ను డీ గ్రేడ్ చేయడంతో చంద్రబాబు అధికారంలోకి వస్తే గానీ పని అయేటట్లు లేదని తన కుట్ర పుస్తకంలో చాలా రోజుల క్రితం అందరు రాజకీయ నాయకులూ వాడే ఓ అస్త్రాన్ని ప్రయోగించనున్నారట.. నేషనల్ ఫ్రంట్ ఇది ఎన్టీఆర్ కాలం నాటి మాట.. ఏదైనా పార్టీ మీద పోరాటం చేయాలంటే అక్కడి ఇతర పార్టీ లను తన గుప్పిట్లోకి తెచ్చుకుని తాను టార్గెట్ చేసిన పార్టీ ని దెబ్బ కొట్టడమనేది ఈ నేషనల్ ఫ్రంట్ సిద్ధాంతం.. గతంలో ఎన్టీఆర్ ఈ సిద్ధాంతాన్ని వాడిన పెద్ద గా ఉపయోగం లేకపోయింది.. అయితే మామ ఎన్టీయార్ ని తలచుకుని ఏపీవరకూ మరో నేషనల్ ఫ్రంట్ కట్టాలన్నది చంద్రబాబు ఆలోచనట.
వాస్తవానికి బీజేపీ, జనసేనలు ఒక జట్టుగా వచ్చే ఎన్నికల్లో కొనసాగుతాయన్నది ఇప్పటికే అందరికి స్పష్టంగా తెలిసింది.. వైసీపీ కూడా వామపక్షాలతో చాలా వరకు మంచి సంబంధాలే కొనసాగిస్తోంది. ఇక కాంగ్రెస్ ఒక్కటే మిగిలి ఉంది.. కాంగ్రెస్ టీడీపీ తో మహాకూటమి లో ఉందన్న సంగతి తెలిసిందే.. అయితే ఎన్నికల టైం వచ్చే వరకు వైసీపీ కాకుండా ఇతర పార్టీ ల మద్దతు దాక్కుంచుకుని పీఠం ఎక్కాలన్నది చంద్రబాబు ఆలోచన.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎవరూ జగన్ తో డైరెక్ట్ గా చెలిమి చేసే సీన్ లేదు. ఇక అటు వామపక్షాలు, ఇటు బీజేపీ కూటమి కూడా కలిసేది లేదు. కానీ చంద్రబాబు మాత్రం ఏపీలో జగన్ కి వ్యతిరేకంగా అందరికీ ఒక్కటి చేయాలనుకుంటున్నారుట. దీని ద్వారా జగన్ పై వత్తిడి తెచ్చే విధంగా ప్లాన్ చేశారట.. మరి చంద్రబాబు ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తాయో చూడాలి..