బిగ్ బాస్ లోకి వెళ్లేంత వరకు నూతన నాయుడు ఎవరో కనీసం పక్కింటివారికి కూడా తెలిసుండకపోవచ్చు.. కానీ బిగ్ బాస్ లోకి కామన్ మ్యాన్ గా వెళ్లి అక్కడ కొంత హడావుడి చేసిన నూతన్ నాయుడు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.. ఓ దళిత యువకుడికి శిరోముండనం చేసి దొరికిపోగా ఈ కేసులో నూతన్ నాయుడు భార్య తో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టు ముందుకు హాజరు పరచగా వారికి 14 రోజుల రిమాండ్ ని విధించారు. ఇక ఈ కేసు వెలుగులోకి వచ్చిన దగ్గరినుండి నూతన్ నాయుడు పరారీ లో ఉండగా కర్ణాటక లోని ఉడిపి లో పోలీసులకు చిక్కాడు..

ముంబై పారిపోతుండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచారు.. ఇక పూర్తి ఆధారాలతోనే, నూతన్ నాయుడు కూడా ఈ కేసులో భాగస్వాముడే అని తెలిసిన తర్వాతే అతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.. అదే కాకుండా నూతన్ నాయుడు ఇప్పటివరకు చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకి వచ్చాయి.. శిరోముండనం కేసులోనే కాదు మరిన్ని నేరాలలో నూతన్ నాయుడు హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి..  ఇక ఇటీవలే జైలు శిక్ష తర్వాత నూతన్ నాయుడు భార్య జైలు నుంచి విడుదల అయ్యింది.. అయితే విడుదల అయిన కొద్దీ గంటల్లోనే ఆమెను మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది.

ఎందుకంటే నూతన్ నాయుడు భార్య మధుప్రియ కూడా ఉద్యోగాల పేరుతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి నుండి 25లక్షలు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దళిత యువకుడి శిరోముండనం కేసులో బెయిల్ పొందిన ఆమె కొద్ది గంటల్లోనే మళ్ళీ అరెస్ట్ కావడం గమనార్హం. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి డబ్బులు వసూలు చేసారని మోసపోయిన వ్యక్తి పిర్యాదు చేయడంతో పోలీసులు మధుప్రియపై చీటింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.. ఈ నేపథ్యంలో నూతన్ నాయుడు ఇంకెన్ని చట్ట వ్యతిరేఖ పనులు చేశారో అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: