దసరా, దీపావళి పండుగలకు మరిన్ని రైళ్లుకు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. వేర్వేరు జోన్లలో 39 స్పెషల్ ట్రైన్స్‌ను నడపనుంది. వీటిలో ఏసీ ఎక్స్‌ప్రెస్, దురంతో, రాజధాని, శతాబ్ధి రైళ్లే ఎక్కువ. కొన్ని ప్రాంతాలకు రైళ్లు లేకపోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

దసరా పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను ప్రారంభించాలని కేంద్రం  నిర్ణయించింది. ఇందులో భాగంగా 39 ప్రత్యేక ట్రైన్లను నడిపేందుకు రైల్వే బోర్డ్ అనుమతిచ్చింది. బోర్డు ఆమోదించిన 39 రైళ్లలో చాలావరకు ఏసీ ఎక్స్ ప్రెస్‌లే ఉన్నాయి. వీటిలో దురంతో, రాజధాని, శతాబ్ధి ఉండగా.. దీంతోపాటు పండుగ సీజన్ కారణంగా ప్రయాణీకుల సౌకర్యార్ధం  తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునప్రారంభిస్తున్నట్లు ఐఆర్ సీటీసీ ప్రకటించింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా మార్చి 19 నుంచి నిలిపేసిన లక్నో -న్యూ ఢిల్లీ,  అహ్మదాబాద్- ముంబై తేజస్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను  అక్టోబర్ 17 నుంచి ప్రారంభిస్తున్నారు.

అక్టోబర్ 15నుంచి నవంబర్ 30 మధ్య పండుగ సీజన్ సందర్భంగా 200 రైళ్లను నడుపుతామని రైల్వే బోర్డ్  ప్రకటించింది. అందులో భాగంగా 39 రైళ్ల జాబితాను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే విడుదల చేశారు. మామూలుగానే మన రైళ్లు రద్దీగా ఉంటాయి. ఇక దసరా వస్తోందంటే.. రష్ డబుల్, ట్రిపుల్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. దసరా సెలవులకు ప్రతి ఏడాది ప్రత్యేక రైళ్లు వేస్తారు. ఇక ఈ ఏడాది కూడా సికింద్రాబాద్ నుంచి షాలిమార్‌కు, తిరుపతి నుంచి విశాఖపట్నంకు , సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు కాకినాడ నుంచి లింగంపల్లికి ఇలా చాలా రైళ్లనే ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా టికెట్లను ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటిలాగే స్టేషన్‌కు వచ్చి టికెట్ తీసుకుని తీరికగా వెళ్ళటానికి వీలులేదు. టికెట్‌బుక్ అయినవారు మాత్రమే అరగంట ముందు వచ్చి కరోనా చెక్‌అప్‌ చేపించుకున్న తర్వాతే లోపలకి అనుమతిస్తారు.

డెల్టా ప్రాంతాలైన తణుకు, ఉండి, ఆకివీడు ప్రాంతాలు మీదుగా ఆగి వెళ్లే ట్రైన్లు ఏమి లేకపోవటంతో  ఆయా ప్రాంతాల వారు ఇబ్బందిపుడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ పండుగ సమయానికి సొంతూళ్లకు వెళ్దాం అనుకునే వాళ్లకు తిప్పలు తప్పడం లేదు. రైళ్లైతే వేశారుకానీ, పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు ప్రయాణీకులు. కాకినాడ -లింగంపల్లికి ప్రత్యేక ట్రైన్ వేసినప్పటికీ అది 25వ తేదీకల్లా.. ఆగిపోతుంది. దీనిపై ప్రయాణీకులు అభ్యంతరం చెబుతున్నారు. అయితే ప్రయాణీకుల అవసరం మేరకు మరిన్ని రైళ్లు అందుబాటులోకి తెస్తామంటున్నారు అధికారులు.

ఎన్ని అదనపు రైళ్లు వేస్తున్నా..దసరా వచ్చిందంటే చాలు రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ప్రతీ సంవత్సరం రైళ్లు సరిపోకపోవడంతో.. బస్సులు కూడా రష్ గా ఉండేవి..కానీ ఇప్పుడు కరోనా కారణంగా ఎక్కడి వారు అక్కడే ఉంటున్నారు. ఎప్పటి నుండో అందరికి సెలవలు ఉండటంతో రద్దీ కాస్త తగ్గింది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో రైళ్లు లేనందున ప్రయాణీకులకు అవస్థలు తప్పడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: