వరద నీరు వల్ల బయటకు రాలేని పరిస్థితి.. గత రెండు, మూడు రోజులుగా హైదరాబాద్ లో పడుతున్న వర్షాల కారణంగా చెరువులు, డ్రైనేజీలు నిండి రోడ్ల మీదకు నీరు రావడంతో ప్రజలు ఎవరు బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. కరోనాతో మొన్నటివరకు భయం గుప్పిట్లో ఉన్న భాగ్యనగర వాసులు ఇప్పుడు మళ్ళీ వరద నీటితో నానా కష్టాలు పడుతున్నారు.
ఇండ్ల లో ఉన్నా కరెంట్ లేకపొవడం.. ఏ కమ్యునికేషన్ పనిచేయకపోవడం కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు ఈ వరద నీరు ఎక్కువ ప్రభావం కలిగిస్తుంది. అక్కడ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. హైదరాబాద్ లో ఓ గట్టి వర్షం పడితే ప్రజలు భయాందోళనలో వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. అధికారులు, రెస్క్యూ టీం తమ పని తాము చేస్తున్నా ఇంకా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వర్షం పడుతున్న కారణంగా ప్రజలు ఎవరు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. రోడ్ల మీద వరద నీరు చేరడంతో రవాణా సౌకర్యం కూడా ఆగిపోయింది.