దీనిలో భాగంగానే పార్టీలో బీసీ సామాజిక వర్గ నేతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే బీసీలలో బలమైన సామాజిక వర్గమైన మున్నూరు కాపు సామజిక వర్గానికి చెందిన మరో నేతకు జాతీయ ఓబిసి మోర్చ అధ్యక్షుడిగా బాధ్యతలను అప్పజెప్పారట. అలాగే తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్లను తమవైపు తిప్పుకునేందు సీనియర్ పొలిటిషన్, బిజెపి నాయకురాలు డీకే అరుణ కు జాతీయ బిజెపి ఉపాధ్యక్ష పదవిని అప్పగించింది. దీని వెనుక పెద్ద రాజకీయమే ఉందట. ఆమెను జాతీయ రాజకీయాలలో యాక్టివ్ చేయడం ద్వారా, మహిళలకు బీజేపీ ప్రాధాన్యం ఇచ్చిందనే సంకేతాలు పంపించాలని చూస్తోంది.
దీని ద్వారా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి కూడా కీలకమైన పదవులు దక్కుతాయి అనే విషయాన్ని బీజేపీ ఈ రకంగా చెప్పుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులను చేర్చుకుని, వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనేదే ఇప్పుడు బిజెపి లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు అని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. అందుకే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలపైనే కాకుండా మొత్తం తెలంగాణ అంతా టీఆరెఎస్ జెండానే రెపరెపలాడించాలి అనే లక్ష్యంగా బీజేపీ ఇప్పుడు పావులు కదుపుతోందట.