రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతి విషయంలో చాలా కచ్చితత్వంతో ఉంటాడు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో అయితే కోహ్లీ ఎక్కడా కాంప్రమైజ్ కాడు. ఇక ప్రస్తుతం బెంగళూరు జట్టు సారథిగా జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక అటు భారత జట్టు అయినా ఇటు బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది అంటే అందులో విరాట్ కోహ్లీ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. మైదానంలోకి దిగి పరుగుల వరద పారిస్తూ  ఉంటాడు విరాట్  కోహ్లీ.



 ఇక ఫిట్నెస్ విషయానికి వస్తే ప్రపంచంలోనే ఎక్కువ ఫిట్ నెస్  ఉండే ఆటగాడు విరాట్ కోహ్లీ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ అంటే అందరూ ఫిదా అయిపోతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఎంత బిజీగా ఉన్నా ఎంత ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ ఫిట్నెస్ పై  మాత్రం ఎప్పుడూ దృష్టిసారిస్తోనే  ఉంటారు విరాట్  కోహ్లీ. అందుకే క్రికెట్ ఆటలోనే కాదు ఏ ఆటలో అయినా విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ని  ఎక్కువమంది స్ఫూర్తిగా  తీసుకుంటూ ఉంటారు. అయితే తన ఫిట్నెస్ పై  ఇటీవల విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.




 అయితే తాను ఎంతో ఫిట్ గా ఉండటానికి కారణం క్రమం తప్పని జీవన శైలి అంటూ ఇటీవల విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ప్రతి మ్యాచ్ ముగియగానే శరీరం కాస్త రెస్ట్ తీసుకుని రికవరీ అవడానికి కాస్త సమయం ఇస్తానని... ఆ తర్వాత మళ్ళీ వ్యాయామం చేసి.. ప్రాక్టీస్లో పాల్గొంటాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ కి మ్యాచ్ కి మధ్య ఎంత తక్కువ వ్యవధి ఉన్నప్పటికీ ఈ రొటీన్ జీవనశైలిలో మాత్రం ఎక్కడా మార్పు రాదు అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే ఇలా రోజు చేయడం కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న తర్వాత కాలంలో ఏం జరుగుతుందో అన్న విషయం తనకు తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే ఫిట్నెస్ విషయంలో ఎంతో ఖచ్చితత్వంతో ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ .

మరింత సమాచారం తెలుసుకోండి: