ముంబైలోని బాంద్రాలోని ఒక ఏరియాలో ఫస్ట్ ఫ్లోర్ లో డయాస్ తల్లిదండ్రుల నిర్వహిస్తుండగా సెకండ్ ఫ్లోర్ లో తన అమ్మమ్మ నిలుస్తోంది. అయితే సోమవారం రాత్రి భోజనం చేసి తన నానమ్మ అమ్మమ్మ గదికి డయాస్ వెళ్ళాడు. అప్పుడే అతను తనకి ఒక మొబైల్ ఫోన్ కొనివ్వాలని తన అమ్మని బ్రతిమిలాడాడు. కానీ తన దగ్గర అంత డబ్బులు లేవు అని తన అమ్మమ్మ రోసి తేల్చిపారేసింది. దీంతో కోప్పడిన సదరు యువకుడు తన అమ్మమ్మ నిద్రపోతున్న సమయంలో పదునైన ఆయుధంతో తల నరికాడు. ఆ తర్వాత తన అమ్మమ్మ తలని డైనింగ్ టేబుల్ పై పెట్టాడు.
అయితే తెల్లవారుజామున డయాస్ సోదరుడు పైఫ్లోర్ కి రాగానే రక్తం చెల్లాచెదురుగా కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సదరు సోదరుడు వెంటనే డయాస్ తల్లిదండ్రులకు విషయాన్ని తెలియపరిచాడు. దాంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు డైనింగ్ టేబుల్ పై తన బంధువు తల ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆపై పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచగా అతడిని అక్టోబర్ 17వ తేదీ వరకు పోలీసు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.