హైదరాబాద్ నగర వాసులు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి ప్రాణాలు తీసేందుకు హైదరాబాద్ నగరవాసులు పై పగ పడుతూనే ఉంది. మొన్నటిదాకా ఒక భయం ఉంటే ఇప్పుడు మరో భయం హైదరాబాద్ నగరవాసులు అందరినీ వెంటాడుతుంది. మొన్నటి వరకూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక కరోనా  వైరస్ కేసులు నమోదైన జిల్లాగా హైదరాబాద్ నగరం ఉండగా... ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ నుంచి కోలుకుంటుంది  హైదరాబాద్ నగరం. కానీ అంతలోనే మరో విపత్తు వచ్చి ప్రాణాల మీదికి తెచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నగర వాసులు అందరూ బెంబేలెత్తి పోయారు.



 హైదరాబాద్ నగరం మొత్తం జలదిగ్బంధంలో కి వెళ్లి పోయిన విషయం తెలిసిందే. భారీగా కురిసిన వర్షాలతో నగరం మొత్తం తడిసి ముద్దయింది. దీంతో నగర వాసులు అందరూ దుర్భర స్థితిని గడిపే పరిస్థితి వచ్చింది. ఇక భారీ వర్షం పడడంతో పూర్తిగా నాలాలన్నీ  నిండి పోయి వరద నీరు మురికి నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు అందరూ అల్లాడిపోయారు. ముఖ్యంగా నాలు పొంగిపొర్లే మురికి నీరు జనావాసాల్లోకి చేరిపోవడంతో నగర వాసులు అందరూ ఊపిరాడక ఇబ్బంది పడ్డారు అనే విషయం తెలిసిందే. ఆ మురికి నీటి కంపు భరించలేక... ఆ వరద నీటిలో ఎటు వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కు మంటూ బతుకును వెళ్లదీస్తున్నారు.



 అయితే జిహెచ్ఎంసి అధికారులు శరవేగంగా సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో నే ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎక్కడికక్కడ నాలాలు  పొంగి మురికి నీరు చేరుకోవడంతో నగరవాసులు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కనీసం ఊపిరి పీల్చి ఊపిరి వదలాలి అన్న కూడా అదో  పెద్ద నరకం లా మారిపోయింది ప్రస్తుతం నగరవాసులు అందరికీ. ఇక రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న తరుణంలో నగరవాసుల గుండెలు గుబెల్లుమంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: