ఇక తన పార్టీ లో ఉన్న అసంతృప్తి నేతలను వైసీపీ లోకి లాక్కోవడం లో జగన్ చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోవట్లేదు.. కాకపోతే చంద్రబాబు లా దొంగదారిలా కాకుండా రాజీనామా చేసి రమ్మంటున్నారు.. ఇక టీడీపీ లో అసంతృప్తుల నేతలు రోజు రోజు కీపెరిగిపోతున్నారని చెప్పొచ్చు.. పార్టీ లో గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు కి ఇది పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు.. బలపరిచేందుకు ఇటీవలే పార్లమెంట్ ఇన్ ఛార్జ్ లను నియమించారు.. ఒక్కో పార్లమెంట్ కి ఒక్కో అభ్యర్థి ని నియమించి పార్టీ బలపడేలా చేయాలనీ, పోయిన నమ్మకాన్ని తెచ్చుకునేలా చేయాలనీ చంద్రబాబు సూచించారు.. ఈ నేపథ్యంలో బాపట్ల లో టీడీపీ ఇంచార్జి గా పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నియమించారు చంద్రబాబు.
అయితే ఇంచార్జి పోస్ట్ ఇచ్చినా ఏలూరి లో చంద్రబాబు పట్ల అసంతృప్తి ఉందని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఏలూరికి వైసీపీ నుండి ఒత్తిళ్ళు వస్తున్నాయని, ఏదో రోజు టీడీపీని వదిలేసి వైసీపీలో చేరటం ఖాయమని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్నది. ఇదే సమయంలో పార్టీకి భవిష్యత్తు లేదన్న కారణంతో ఎంఎల్ఏనే పార్టీ మారిపోదామని అనుకుంటున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. కారణం సరిగ్గా తెలియకపోయినా పార్టీ కార్యక్రమాలకు ఏలూరి మాత్రం చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. ఒక్క ఏలూరే కాదు జిల్లాలో కొండపి ఎంఎల్ఏ డాక్టర్ బాల వీరాంజనేయస్వామి, అద్దంకి ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ఆసక్తి చూపటం లేదు.