అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయన్న విషయం తెలిసిందే. అయితే భారీ వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయి అని అనుకుంటున్న తెలంగాణ ప్రజానీకానికి వాతావరణ శాఖ అధికారులు గుదిబండ లాంటి వార్త చెప్పారు. మరో మూడు నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో మళ్లీ వర్షాలు రానున్నాయని తెలియడంతో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు అటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్న విషయం తెలిసిన సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గి పోయాయి. దీంతో రానున్న రోజుల్లో చలి తో కూడా కూడా పోక తప్పదు అని ప్రజలందరూ మరింత బెంబేలెత్తుతున్నారు