తనకి ఎప్పుడూ కళలు, సాహిత్యం మీద ఆసక్తి ఎక్కువ. గడిచిన నాలుగు సంవత్సరాలుగా బియ్యపు గింజల మీద కళాకృతులు వేయడం మొదలు పెట్టింది ఈమె . తాజాగా ఆమె రాసిన బియ్యపు గింజల మీద భగవద్గీత మాత్రం అద్భుతంగా మారింది . ఈమె ఎల్ఎల్బీ చదువుతోంది. స్వారిక కి న్యాయ మూర్తి కావాలనేది కోరికని చెప్పారు. మహిళలకు స్ఫూర్తిగా నిలవాలనేది తన ఆకాంక్ష అని ఆమె వివరించారు. ఈ బియ్యం గింజల తో భగవద్గీత విషయానికి వస్తే....... 4,042 బియ్యపు గింజల పై భగవద్గీతను రాశారు ఈమె. మొత్తం 36,378 అక్షరాల తో కూడిన 9,839 పదాలను రాయడానికి 150 గంటల సమయం తీసుకున్నారు స్వారిక.
గతం లో ఆమె సూక్ష్మ కళాకారిణిగా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. అలానే నార్త్ ఢిల్లీ కల్చరల్ అసోసియేషన్ స్వారికకు 'రాష్ట్రీయ పురస్కార్'ను అందజేసింది. గతేడాది నవంబర్ 26న (న్యాయ దినోత్సవం) వెంట్రుకల పై రాజ్యాంగ ఉపోద్ఘాతాన్ని రాసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇలా ఈమె ఎన్నో మైక్రో ఆర్ట్స్ చేసి అందరి ప్రశంసలు పొందడం జరిగింది.