భారత్ లో కరోనా  వైరస్ ఏ రేంజిలో విజృంభిస్తున్నదో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ తో సహజీవనం తప్పదు అని భావించి క్రమక్రమంగా అన్లాక్ మార్గదర్శకాలను జారీ చేస్తూ అన్ని రకాల కార్యకలాపాలను ప్రస్తుతం ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటివరకు కరోనా వైరస్ పేరెత్తితేనే బెంబేలెత్తిన జనం కరోనా వైరస్ తో సహజీవనం చేయక తప్పదు అని భావించి ప్రస్తుతం రోడ్లమీదకు తిరుగుతూ రోజువారీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇక ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది.



 రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూనే ఉంది అనే విషయం తెలిసిందే. అదే ఆ సమయంలో దేశంలో రికవరీ రేటు కూడా ఎక్కువ స్థాయిలో ఉండడం ప్రస్తుతం ప్రజలందరిలో కాస్త ధైర్యం నింపుతుంది. అందుకే అన్లాక్ మార్గదర్శకాల లో భాగంగా తగిన జాగ్రత్తలు మధ్య అన్ని రకాల కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు ప్రజలు. అయితే ఈ మధ్య కాలంలో దేశంలో పలు ప్రాంతాలలో రెండవసారి కరోనా సోకిన కేసులు కూడా తెర మీదికి వస్తుండటం  ప్రజలందరిలో ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడం కూడా మరింత భయాందోళనకు గురిచేస్తుంది.



 ఇక ఇటీవల ఇదే విషయంపై ఐసీఎంఆర్ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ బారినపడి కోరుకున్న వారిలో కూడా మళ్ళీ ఐదు నెలల్లో  యాంటీ  బాడీ లు తగ్గితే  కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అందుకే కరోనా వైరస్ బారినపడి చికిత్స తీసుకొని కోరుకున్నవారు నిర్లక్ష్యం చేయకుండా మాస్కులు ధరించడం తో పాటు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించి తగిన జాగ్రత్తలు పాటించాలి అంటూ ఐసీఎంఆర్ హెచ్చరించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 24 రీ  ఇన్ఫెక్షన్ కేసులు నమోదవగా భారత్లో ఇప్పటివరకు 3 రీ  ఇన్ఫెక్షన్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: