దీనికి సంబంధించిన కసరత్తులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ధరణిపోర్టల్ దసరాకు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక ఈ ధరణి పోర్టల్ ద్వారా కేవలం గంటల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి పాస్బుక్ కూడా చేతికి వచ్చే అవకాశం ఉంది అని ఇటీవలే అధికారులు కూడా తెలపడంతో ప్రజలందరూ ధరణి పోర్టల్ ప్రారంభం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ప్రజలకు నిరాశ తప్పదు అన్నది అర్ధమవుతుంది.
ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ దసరా పండుగ పర్వదినం సందర్భంగా లాంఛనంగా ప్రారంభించాలి అని అనుకుంది. కానీ ప్రభుత్వం అనుకున్నది మాత్రం జరిగేలా కనిపించడం లేదు. ధరణి పోర్టల్ ప్రారంభం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్ లో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడం టెస్ట్ రన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ధరణి పోర్టల్ ఈ నెల 25న కాకుండా 29వ తేదీన ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ధరణి పోర్టల్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్న ప్రజలందరికీ నిరాశ ఎదురైంది అని చెప్పాలి.