దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. ఇది ఇలా ఉండగా ప్రతీ ఒక్కరికి ఏదో ఒక గోల్ ఉంటుంది. దానిని సాధించడానికి ఎంతో కష్ట పడతారు. ఆ విజయాన్ని అందుకునే క్రమంలో  చాలా సార్లు ఓడిపోతారు కానీ మళ్ళీ విజయం కోసం ప్రయత్నం చేస్తారు.  కానీ విజయం సాధించాలంటే  అటువంటి వారు విజయ దశమి నాడు తమ లక్ష్యాన్ని తిరిగి ప్రారంభిస్తే తప్పక దాన్ని చేరుకుంటారు. మరి దీనికి సంబంధించిన పలు  విశేషాలు ఇక్కడ ఉన్నాయి చూసేయండి.


విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. దసరాని తొమ్మిది రోజుల పాటు చేస్తాం. ఆ తొమ్మిది రోజులు అయ్యాక నవరాత్రులల్లో పదవరోజు పూర్ణాహుతి చేస్తారు. ఊరేగింపు కూడా ఉంటుంది కొన్ని చోట్ల. అయితే యిది ఇలా ఉండగా ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఆశ్వయుజ శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులు జగన్మాతను ఆరాధిస్తారు.  దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి చివర మూడు రోజులు.

దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణా నక్షత్రంతో కలసిన ఆశ్వయుజ దశమికి విజయా అనే సంకేతముంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా విజయదశమి రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తప్పక వరిస్తుంది అని అంటారు. మరి మీరూ విజయదశమి రోజు మీ గోల్ ని ప్రారంభించండి విజయాన్ని అందుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: