పూర్తి వివరాలు తెలుసుకుంటే.. సర్గన్వా గ్రామానికి చెందిన సబల్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తరచు తగాదా పెట్టుకునేవాడు. దసరా శరన్నవరాత్రుల ఈ సందర్భంగా ఆమె ఉపవాసం ఉంటే దేవికి పూజ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెను అతి కిరాతకంగా కడతేర్చాడు భర్త. ఈ హత్య వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సంఘటనా స్థలంలో ఏవో క్షుద్ర పూజలు చేసినట్టు పోలీసులు కనిపెట్టారు. ఇదే విషయంపై నిందితుడు సబల్ ని ప్రశ్నించగా.. అమ్మవారికి బలి ఇచ్చానంటూ అతడు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అతీంద్రియ శక్తులు వస్తాయని తన భార్యను చంపానని మొదట్లో చెప్పుకొచ్చిన సబల్ ఆ తరువాత తన భార్యపై అనుమానం ఉందని.. అందుకే ఆమెను చంపానని ఒప్పుకున్నాడు. మరి క్షుద్ర పూజలు ఎందుకు చేశాడన్న అనే కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
దసరా పండుగ సందర్భంగా బంధువులు నిన్న రాత్రి సబల్ ఇంటికి వచ్చారు. అయితే సబల్ భార్య పూజ గదిలో కనిపించడంతో వాళ్ళు అంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత గ్రామస్తులకు తెలపడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి దేహాన్ని పోస్టుమార్టం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.