ఇక ఈ ఉద్యోగ అర్హత విషయానికి వచ్చే సరికి...... కుక్కలను ప్రేమించేవారు, అంటే వాటిని ప్రేమగా చూసుకునే వారికి మాత్రమే ఈ అర్హత ఇచ్చారు. ముఖ్యంగా డాగ్ వాకర్ కూర్చున్న చోట, కూర్చోకుండా కుక్క వెంట లండన్ వీధులన్నీ తిరుగుతూనే ఉండాలని, ఇందుకు ఉద్యోగి కి ఫిట్‌నెస్ కూడా అవసరమని పేర్కొంది. ఏం విడ్డూరమో కదా...! ఇది ఇలా ఉండగా కేవలం జీతం మాత్రమే కాకుండా వీళ్ళకి పింఛను, జీవిత భీమాల తో ఆటు ప్రైవేటు ఆరోగ్య , డెంటల్ బీమా సదుపాయాలు కూడా ఉంటాయని పేర్కొంది.
మరి జీతం ఎంతో తెలుసా...? ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా ఏడాదికి 30 వేల పౌండ్లను (దాదాపు 29 లక్షల రూపాయలు, నెలకు రెండు లక్షలపైనే). ఈ వార్త చూసిన ప్రతీ వారు ఆశ్చర్యపోతున్నారు. మరి ఉద్యోగపు వేళలు విషయం లోకి వస్తే..... ప్రతి సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు. ఇలా ఈ పెంపుడు కుక్క యోగ క్షేమాలు చూసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ సరి కొత్త ప్రకటన ఇప్పుడు వైరల్ గా మారింది.