ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు రవాణా సర్వీసులు   పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఇటీవల అన్లాక్  మార్గదర్శకాలు లో భాగంగా కేంద్ర ప్రభుత్వం  అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభించు కునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే దాదాపుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభం అయ్యాయి. కానీ తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రం అంతర్  రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులకు సంబంధించిన ముహూర్తం ఇంకా ఫిక్స్ కావడం లేదు.



 అయితే తెలుగు రాష్ట్రాల మధ్య అంతర రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్ర రోడ్డు రవాణా అధికారుల మధ్య సరైన ఒప్పందం కుదరక పోవడంతో ఇది కాస్త వాయిదా పడుతూ వస్తోంది. పలుమార్లు ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీకీ ప్రతిపాదనలు పంపినప్పటికీ తెలంగాణ ఆర్టీసీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం మరింత ఆలస్యం అవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ పండుగ సీజన్లో అయినా తెలుగు రాష్ట్రాల మధ్యన బస్సులు ప్రారంభమవుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రయాణికులు. కానీ  పండగ సీజన్లో కూడా నిరాశే ఎదురైంది.



 అయితే తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభం అంశం నేడు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  చెరో  1.61 లక్షల కిలోమీటర్లు బస్సు సర్వీసులను తిప్పుకోవాలని తెలంగాణ ప్రతిపాదనకు ఏపీఎస్ఆర్టీసీ ఆమోదించినప్పటికీ.. ఈ ప్రతిపాదనలో  మరోసారి తెలంగాణ ఆర్టీసీ కీలక మార్పులు కూడా సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈరోజు తెలుగురాష్ట్రాల ఆర్టీసీ అధికారులు భేటీకానుండగా  రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం  ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే ఇప్పటికే పలుమార్లు బస్సు సర్వీసులు ప్రారంభం వాయిదా పడుతూ రాగా..  ఈ సారైనా ప్రారంభం అవుతుందా లేదా అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: