ఓవైపు మిత్ర దేశంగా భావిస్తూ ఆర్థిక సహాయం చేస్తున్నట్లు పైపైకి మాటలు చెబుతూనే మరోవైపు ఎంతో వ్యూహాత్మకంగా భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటుంది చైనా. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇలాంటి తరహా వ్యూహాన్ని అమలు చేసింది చైనా. ఇప్పటికే పాకిస్తాన్ లో ఎన్నో రకాల ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వి ఆర్ ఐ రైల్వే ప్రాజెక్టును పాకిస్తాన్లో పట్టింది చైనా. కరాచీ నుంచి పెషావర్ వరకు రెండు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్ట్ ఇది. దీంట్లో 10 శాతం పెట్టుబడి పాకిస్తాని పెడితే 90 శాతం పెట్టుబడి చైనా పెట్టింది ఆ తర్వాత పాకిస్తాన్ దఫాల వారీగా ఆ అప్పు చెల్లించేందుకు కూడా అవకాశం కల్పించింది చైనా .
ఈ ప్రాజెక్టు విషయంలో ఇటీవలే చైనా సరి కొత్త విధానాన్ని అమలు చేసింది. ఇటీవలే ఈ ప్రాజెక్టును నిలిపివేసింది చైనా. అయితే ఇప్పటివరకు సదరు ప్రాజెక్టు కోసం చైనా పెట్టిన పెట్టుబడి గాను పాకిస్తాన్ లోని పలు భాగాలను తనకు అప్పగించాలని చైనా సరికొత్త ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఓ వైపు పాకిస్తాన్ తో మిత్ర దేశంగా ఉంటూనే మరోవైపు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పాకిస్తాన్ కు సంబంధించిన అన్ని భూభాగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా ప్రయత్నిస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.