పూర్తి వివరాలు తెలుసుకుంటే... దసరా పండుగ పూర్తయిన తర్వాత బండార జిల్లాలోని శివపురి మండలంలోని ముహారీకుర్ద్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి తినుబండారాలు కోసమని ఇంటి నుండి బయటికి వెళ్ళింది. అయితే పండిత్ నాథురాం శాస్త్రి అనే ఒక వ్యక్తి 17 ఏళ్ల బాలికకు తినడానికి ఏమీ ఇవ్వకుండా.. బాగా తిట్టి పంపించేశాడు. దీంతో బాగా అవమానంగా ఫీల్ అయిన సదరు బాలిక ఇంటికి వెళ్లి బాగా ఏడ్చింది. ఆ తర్వాత పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో బాలికా కారిపోతూ గట్టిగా అరుస్తూ ఉండడంతో ఇరుగుపొరుగువారు వచ్చి మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే బాలిక శరీరం 90% కాలిపోయింది. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తీసుకు వెళ్లినప్పటికీ బాలిక ప్రాణాలు దక్కలేదు.
చనిపోయిన బాలిక కుటుంబం కారణంగానే తన ఆవు చనిపోయిందని నాథురాం శాస్త్రి ఆరోపిస్తూ వారిని హింసిస్తున్నాడు అని స్థానికులు వెల్లడించారు. ఈ విషయంలో గ్రామ పెద్దలు పంచాయతీ కూడా నిర్వహించి.. ఇద్దరి మధ్య ఎటువంటి తగాదాలు జాగ కూడదని హెచ్చరించారు. ఆ తర్వాత శాంతి పూజ చేయాలని చెప్పారు. గ్రామ పెద్దలు చెప్పినట్టుగానే మృతురాలి కుటుంబ సభ్యులు పూజ జరిపించారు. కానీ నాథురాం మాత్రం ఆ కుటుంబాన్ని కనిపించినప్పుడల్లా తిడుతూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల 17 ఏళ్ల బాలికను పెట్టడంతో ఆమె కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నాథురాం గురించి తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టడం ప్రారంభించారు. అభం శుభం తెలియని బాలిక చనిపోవడంతో ముహారీకుర్ద్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.