మన దేశంలోని ప్రధాన నగరాల్లో ఫార్మా కంపెనీల వ్యర్ధాలు ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్నాయి. జల, వాయు కాలుష్యంతో జనం ఊపిరి సలపడం లేదు. తాజాగా విశాఖ పరవాడ పెద్ద చెరువులో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడటం స్ధానికంగా కలకలం సృష్టించింది. నిబంధనలు పాటించని మందుల కంపెనీలపై చర్యల కోసం జనం ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది.

పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ.. విశాఖలోని ప్రముఖ పారిశ్రామికవాడ. ఇక్కడసుమారు 90వరకు ఔషధ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయ్‌. జేఎన్ పీసీ పేరు చెబితే వరుసగా జరిగే ప్రమాదాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఇక వీటి నుంచి వెలువడుతున్న వాయు, జల కాలుష్యంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.

ఫార్మా కంపెనీల వ్యర్థ రసాయనాలు పశుపక్ష్యాదులకైతే శాపంగా మారాయి. తరచూ మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా రసాయినాల దెబ్బకు పరవాడ పెద్ద చెరువులో చేపలు పెద్ద ఎత్తున మృత్యువాత పడటం స్థానికంగా కలకలం రేపుతో౦ది. టన్నుల కొద్ది చేపలు మృత్యువాత పడి నీటిపై తేలియాడట౦తో స్థానికులు ఆ౦దోళన చె౦దుతున్నారు.

పరిశ్రమలు నిబ౦ధనలకు విరుద్ధంగా గుట్టుగా విడిచి పెడుతోన్న వ్యర్దాలు చెరువులు, వాగులలోకి చేరి తీవ్ర దుష్ప్రబావాన్ని చుపుతున్నాయి. ఈ పరిస్ధితికి మాయదారి ఫార్మా కంపెనీల నిర్లక్ష్యమే కారణమనేది బహిరంగ ఆరోపణ. పరిశ్రమల కాలుష్యం నుంచి తమను కాపాడమని జనం ఆందోళనలకు దిగాల్సిన పరిస్ధితి తలెత్తింది.

ఇటీవల పడిన భారీ వర్షాలకు ఫార్మాసిటీకి చెందిన పంప్ హౌస్ దగ్గర వ్యర్ధాల మ్యాన్ హోల్ లీకై పెద్ద ఎత్తున వ్యర్ధ జలాలు రోడ్లపైకి వచ్చాయి‌. వాటిని చెరువుల్లోకి వదలడంతో నీరు కూడా రంగు మారాయని స్థానికులు గగ్గలు పెడుతున్నారు.

మొత్తం మీద.. పారిశ్రామికవ వ్యర్ధాలతో మత్స్య సంపద కూడా నాశనమవుతోంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని వాటిని అరికకట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.చూద్దాం.. పారిశ్రామిక వ్యర్థాల నుంచి ప్రజలను అధికారులు ఎలా కాపాడతారో.

మరింత సమాచారం తెలుసుకోండి: