ఇప్పటివరకు ఎంతో మెరుగైన టెలికాం రంగ సర్వీసులను తమ కస్టమర్లకు అందించిన ఎయిర్టెల్ ఇప్పుడు ఏకంగా కస్టమర్లకు రుణాలు అందించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా కొత్త మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఎంతగానో ఊరట కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్టెల్ 2జీ అర్హత కలిగిన కస్టమర్లు 4జికి అప్గ్రేడ్ చేసుకోవడం కోసం లోన్ తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇక ఎయిర్టెల్ అందించిన ఆఫర్ ప్రకారం మార్కెట్ ధర కన్నా అతి తక్కువ ధరకే మొబైల్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక తమ కస్టమర్లకు ఎయిర్టెల్ లోన్ అందించేందుకు గాను ఐడిఎఫ్సి బ్యాంక్ తో చేతులు కలిపింది.
అయితే ఈ లోన్ పొందాలి అని భావించే కస్టమర్లు ముందుగా డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక దీని కోసం 3259 రూపాయలు చెల్లించి లోన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు తీసుకున్న రుణాన్ని పది నెలల లోపు చెల్లించాల్సి ఉంటుంది, నెలకు ఈఎంఐ కేవలం 603 రూపాయలు మాత్రమే ఉంటుంది. అంటే కేవలం తొమ్మిది వేల మూడు వందల రూపాయలతో 4జి హ్యాండ్సెట్ లభిస్తుంది అని చెప్పాలి. కేవలం 2జీ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఇలా లోన్ తీసుకున్న వారికి 260 రూపాయలతో బండిల్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంటుంది.