కరోనా వైరస్ ప్రభావం విద్యారంగంపై ఎక్కువగా పడిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ సమయంలో సంక్షోభంలో కూరుకుపోయిన అన్ని రంగాలు ప్రస్తుతం క్రమక్రమంగా కరోనా వైరస్ ప్రభావం బారి నుంచి బయటపడి పుంజుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి క్రమంలో విద్యా రంగం మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయిలో పుంజుకో  లేకపోయింది అనడంలో అతిశయోక్తిలేదు  కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాసంస్థలు పునప్రారంభించాలని అనుమతులు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఆ ధైర్యాన్ని చేయలేకపోతున్నాయి. చిన్న పొరపాటు జరిగినా విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకడుగు వేయక తప్పలేదు.



 కరోనా వైరస్ ప్రభావం దృశ్య ప్రస్తుతం ఎన్నో రకాల పరీక్షలను రద్దు చేస్తూ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పదో తరగతి పరీక్షలను రద్దు చేయడంతో పాటు మరికొన్ని పరీక్షలను కూడా రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యార్థుల ప్రాణాలకు  ఎలాంటి హానీ కలగకూడదు  అనే ఉద్దేశంతోనే తెలంగాణ విద్యా శాఖ పరీక్ష రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా విద్యార్థులందరినీ పాస్ చేస్తూ అందరికీ శుభ వార్త చెప్పింది.


ఇక ఇప్పుడు మరోసారి కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యా శాఖ ఇంటర్ సెకండియర్ విద్యార్థులు అందరికీ శుభ వార్త చెప్పింది. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు కరోనా వైరస్ ప్రభావం కారణంగా గైర్హాజరైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని భావించిన తెలంగాణ  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులు అందరిని పాస్ చేయాలని తెలంగాణ శాఖ నిర్ణయించింది. వివిధ కారణాల ద్వారా దాదాపు 27 వేల మంది ఇంటర్ సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాయ లేదు ఇక వారందరిని పాస్ చేసేందుకు తెలంగాణ విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: