సాధారణంగా అయితే పాత సినిమాల్లో  సరిగ్గా పెళ్లి మండపంలో వరుడు వధువుకు తాళికట్టే సమయంలో ఆపండి అనే డైలాగ్ కామన్గా వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కాలంలో ఏకంగా ఇష్టం లేని పెళ్లి   పీటల పెళ్లి పీటల వరకు వచ్చి  తనకు ఇష్టం లేదు అన్న సీన్లు కూడా పలు సినిమాలలో కనిపించాయి. కానీ నిజ జీవితంలో మాత్రం దాదాపుగా అలా జరగదు. ఎందుకంటే ఒకవేళ పెళ్లి ఇష్టం లేదు అంటే పెళ్లి పీటల వరకు పెళ్లికూతురు వెళ్లేందుకు ధైర్యం చేయదు.. పెళ్లికి ముందే తనకు పెళ్లి ఇష్టం లేదు అన్న విషయాన్ని ఇంట్లో చెప్పడం... లేదా ఇంట్లో నుంచి పారిపోవడం లాంటివి చేస్తూ ఉన్న ఘటనలు ఈ మధ్యకాలంలో తెర మీదకు వస్తున్నాయి.



 కానీ ఇక్కడ ఒక పెళ్లి కూతురు మాత్రం చాలా ధైర్యవంతురాలు అనే చెప్పాలి. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించికుంది కానీ అంతలోనే పెద్దలు ఊహించని విధంగా తనకు సంబంధం చేశారు. దీంతో ఇంట్లో పెద్దలకు తన ప్రేమ విషయం చెప్పకుండానే అంతా తనకు ఇష్టమే అన్నట్లు గా వ్యవహరించింది యువతి. ఇక పెళ్లి వ్యవహారం కాస్త ఏకంగా పెళ్లి పీటల వరకు వచ్చింది. బంధుమిత్రులందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు. సరిగ్గా వరుడు తాళి తీసుకొని మెడలో కట్టబోతున్న సమయంలో... ట్విస్ట్ ఇచ్చింది యువతి. తనకు పెళ్లి ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చింది




 దీంతో వరుడు తో పాటు అక్కడున్న వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు... అంతేకాదు తన ప్రియుడు మరో గంట లోపల వస్తాడని తన ప్రియుడితో వెళ్లిపోతానని అతనిని పెళ్లి చేసుకుంటాను అంటూ అందరి ముందు తెగేసి చెప్పేసింది. దీంతో సరిగ్గా పెళ్లి పీటల మీద తాళికట్టే ముందు వధువు షాక్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అక్కడున్న పెద్దలందరూ ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు యువతి మాత్రం వినలేదు. ఇక పక్కనున్న వ్యక్తి దీన్నంతటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారిపోయింది. ఆ యువతి ధైర్యానికి అందరూ అవాక్కవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: