రాజకీయ చాణిక్యుడు గా పేరుపొందిన టిడిపి అధినేత చంద్రబాబు ఎత్తుగడలు ఒకపట్టాన ఎవరికి అర్థం కావు. తిమ్మిని బమ్మి చేయగల అపర మేధావి ఆయన. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో రకాల ఎత్తుగడలను, మరెన్నో రకాల ఒడిదుడుకులను ఆయన చవిచూశారు. అయిన పార్టీని ఈ స్థాయిలో కి తీసుకురాగలిగారు అంటే ఆయన మాస్టర్ మైండ్ అటువంటిది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వానికి మెజారిటీ పరంగా ఎటువంటి డోకా లేదు. 151 మంది ఎమ్మెల్యేలతో పాటు టిడిపి నుంచి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేల మద్దతు, అలాగే జనసేన పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే మద్దతు జగన్ ప్రభుత్వానికి ఉన్నాయి . ఈ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసినా,  అది చెల్లుబాటు అవుతుంది. అయితే వైసిపి కంటే బాగా బలహీనంగా ఉన్న టిడిపి రాజకీయ ఎత్తుగడలు ముందు వైసిపి ప్రభుత్వం నిలబడలేక పోతోంది. ఏ నిర్ణయాన్ని అమలు చేయలేకపోతోంది.



ఇదంతా బాబు రాజకీయ వ్యూహమే. ఇదిలా ఉంటే , చాలా రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే ఎన్నికల ప్రస్తావన తీసుకు వస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా జమిలి ఎన్నికల గురించి కలవరిస్తున్నాడు. 2022 లో ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయని పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి అంటూ హడావుడి చేస్తున్నారు. అయితే బాబు ఇంత హడావుడి చేయడం రాజకీయ జిమ్ముక్కు గానే అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే, బాబు అదే పనిగా జమిలి జపం చేయడం వెనుక కారణం లేకపోలేదని, కేంద్ర బిజెపి పెద్దల నుంచి బాబుకు తగిన సమాచారం ఉండటంతోనే, ఆయన అదే పనిగా ఎన్నికలు వస్తాయి అంటూ చెబుతున్నారనే కోణాన్ని ఇప్పుడు టిడిపి నాయకులు హైలెట్ చేస్తున్నారు . 



బిజెపి-టిడిపి పొత్తు పెట్టుకోక పోయినా, పాత పరిచయాలతో బాబు రాజకీయం నడిపిస్తున్నారని, జమిలి ఎన్నికల పేరు చెప్పి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు దీనిని వాడుకున్నట్లు గా కనిపిస్తున్నారు. బాబు అదేపనిగా కేంద్ర బిజెపి  పెద్దలతో ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ వస్తుండడం, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా టిడిపికి కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: