అయితే పలుమార్లు పేటీఎం వినియోగదారులు ఇలాంటి చార్జీల ద్వారా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ ఛార్జీల విషయంలో శుభ వార్త చెప్పింది పేటియం. వాలెట్ నుంచి డబ్బులు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఇంతకుముందు వరకు వసూలు చేసే ఛార్జీలు ప్రస్తుతం తొలగిస్తున్నట్లు ప్రకటించింది. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇది పేటీఎం వినియోగదారులందరికీ గొప్ప శుభవార్త అనే చెప్పాలి.
సాధారణంగా అయితే పేటీఎం వాలెట్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు... నగదు మొత్తంలో 5 శాతం వరకు చార్జీలు వసూలు చేసేది పేటీఎం. ఎంతోమంది వినియోగదారుల నుంచి సదరు ఛార్జీలు తొలగించాలంటూ డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చార్జీలను తగ్గిస్తున్నట్లు పేటియం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ప్రకటించారు. ఒకవేళ క్రెడిట్ కార్డ్ నుంచి పేటియం వాలెట్ కు డబ్బులు చెల్లించుకోవాలని భావిస్తే మాత్రం ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది.