దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హాట్హాట్గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు మొన్నటివరకు ప్రచారం చేపట్టి ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఎవరికి వారు ప్రజల వద్దకు చేరి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ప్రజల్లో తనపై నమ్మకం కలిగించేందుకు ప్రచారం చేపట్టారు. ఇక టిఆర్ఎస్ పార్టీ నుంచి ట్రబుల్ షూటర్ హరీష్రావు రంగంలోకి దిగి ప్రజలను ఆకర్షించేందుకు ప్రచారం చేయగా... బిజెపి పార్టీ నుంచి బండి సంజయ్ కూడా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.



 దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో అక్కడక్కడా పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటుచేసుకున్నాయి. అయితే దుబ్బాక ప్రచారం లో పాల్గొనడానికి వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఆందోల్  ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా దుబ్బాకలో ప్రచారం నిర్వహించేందుకు వచ్చారు. సిద్దిపేటలోని ఓ హోటల్లో క్రాంతి కిరణ్ బస చేస్తున్న సందర్భంలో.. ఆయనపై కొంతమంది వ్యక్తులు దాడికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది అన్న విషయం తెలిసిందే .



 ఇటీవలే ఇదే విషయంపై స్పందించిన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  సిద్దిపేటలో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ బస చేస్తున్న హోటల్ పైకి బిజెపి కార్యకర్తలు దూసుకుపోయారని.. పథకం ప్రకారమే బిజెపి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల బీజేపీ ఇంచార్జ్ ఉపేందర్రెడ్డి సిద్దిపేట లో ఉన్నప్పుడు తప్పుకాదు కానీ... ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సిద్దిపేటలో ఉంటే తప్పేంటి అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. బిజెపి నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు హరీష్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: