అయితే వ్యవసాయం చేయడమే కాదు మంచి అవగాహన పెంచుకుని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట పండిస్తే వ్యవసాయంలో కూడా అధిక లాభాలను ఆర్జించవచ్చు అని వ్యవసాయ నిపుణులు చెబుతూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో నల్ల గోధుమలకు భారీగా డిమాండ్ ఉంది. మార్కెట్లో మంచి రేటు పలుకుతుండడంతో నల్ల గోధుమలు పండించిన రైతులందరికీ లాభాల పంట పండుతోంది. అయితే రైతులు ఈ పంట పండిస్తే ఎంతో సులువుగా మంచి రాబడి పొందేందుకు అవకాశం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
సాధారణంగానే మార్కెట్లో గోధుమలకు భారీ డిమాండ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక సాధారణ గోధుమలతో పోలిస్తే నల్ల గోధుమలకు 4 రెట్లు ఎక్కువ డిమాండ్ ఉంటుంది... ఇక మరో విషయం ఏమిటి అంటే ఈ పంట పండించడం ద్వారా ఎంత రాబడి పొందవచ్చో ఇక ఈ పంట పండించడానికి కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం నల్ల గోధుమ ధర క్వింటాలుకు ఎనిమిది వేల వరకు పలుకుతోంది. ఇక మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న నల్ల గోధుమలు పండించడం ద్వారా రైతులు లక్షల్లో ఆదాయం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. అయితే నవంబర్ నెల నల్ల గోధుమలు పండించేందుకు మంచి కాలం అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.