అధికార వైసీపీలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది.శ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలోనూ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు రాజులు రాజకీయ ఆధిపత్యానికి తెరలేపారు.మిగిలిన ఒకటి రెండు నియోజకవర్గాల మాదిరిగానే ఇక్కడ కూడా క్షత్రియ నేతల ఆధిపత్యం ఎక్కువ. అయితే, ఓటు బ్యాంకు మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున మంతెన రామరాజు విజయం సాధించారు. గత కొన్ని దశాబ్దాలుగా 2004 మినహా ఇక్కడ ఎప్పుడు టీడీపీ మినహా మరే పార్టీ గెలవలేదు. వైసీపీ ఇక్కడ ఓడిపోయినా పార్టీ అధికారంలో ఉండడంతో ఇక్కడి నేతలు టీడీపీ పై ఆధిపత్యం చేస్తున్నారట..
ఒకరో ఇద్దరో అయితే.. ఫర్వాలేదు కానీ. ఏకంగా వైసీపీకి చెందిన ఐదుగురు క్షత్రియ నేతలు చక్రం తిప్పుతుండడంతో ఇక్కడ రాజకీయాలు వేడెక్కాయి.అయితే వీరిలో ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదు, టీడీపీ ఎమ్మెల్యే మాట వినాలా వద్దా అన్న అయోమయం అధికారులకు ఉందట.. ఉండి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న పీవీఎల్ నరసింహరాజు, మాజీ ఎమ్మెల్యే సర్రాజులు ఎవరికివారే ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు ఉండడంతో అధికారులపై తమ మాట నెగ్గాలని చెప్పి వారిని కన్ఫ్యూజ్ చేస్తున్నారట.. పీవీఎల్ అయితే.. అనధికార ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నారు. ప్రతి పనినీ తనకే చెప్పి చేయాలని అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కూడా నేనేమీ తక్కువ తినలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయనైతే ఒకడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో థానే ఎమ్మెల్యే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.. ఆయనకు కూడా ఇక్కడ బలమైన వర్గం ఉండడంతో తాను చెప్పిందే జరగాలని అధికారులపై తీవ్రమైన ఒత్తిళ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉండి లో రాజకీయాలను సరైన దారిలో పెట్టకపోతే వైసీపీ కి కొంత దెబ్బ పడే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..