ఈ మధ్యకాలంలో ఇలా కల్తీ ఆహారాన్ని కస్టమర్లకు అందిస్తూ సీజ్ అవుతున్న హోటళ్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రోజుల తరబడి నిలువ ఉంచిన ఆహారాన్ని ఎక్కడ దుర్వాసన రాకుండా కస్టమర్లకు అందిస్తున్న ఘటనలు కూడా ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. అంతేకాకుండా కోడి మాంసం పేరుతో వివిధ రకాల జంతువుల మాంసాల ను కూడా విక్రయిస్తున్న ఘటనలు తెరమీదికి వచ్చి అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి.
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో ఇటీవలే విజిలెన్స్ అధికారుల దాడుల్లో ఘోరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్సిల్ చేసిన పాకెట్లో దుర్వాసన వస్తున్న హాల్వా, పెరుగు ప్యాకెట్ లో విషయంలో ఫిర్యాదు అందుకున్న విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించగా మరిన్ని నిజాలు బయటపడ్డాయి. ఏకంగా 15 రోజులకు పైగా నిల్వ ఉంచిన మాంసంతో ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అంతే కాదు మూడు రోజుల క్రితం పాసిపోయిన అన్నంలో పెరుగు రైస్ చేసి విక్రయిస్తున్నారు అనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. మాంసాహార తయారీలో నిషేధిత రంగులను కూడా ఉపయోగిస్తున్నారని గుర్తించిన అధికారులు హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.