అయితే ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని త్వరలో అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవలే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అందరికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెబుతారూ అంటూ ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ప్రస్తుతం ఎంతో మంది యువత నిరుద్యోగంతో కొంత నిరుత్సాహంలో మునిగిపోయారు అంటూ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే నిరుద్యోగులు అందరికీ చేయూతనిచ్చే విధంగా త్వరలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలి అనుకున్న సమయంలోనే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలయింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఎంతో మంది యువత వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారని ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్న వారే ప్రస్తుతం ఇప్పుడు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు.