ప్రస్తుతం భారత దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రతి పది లక్షలకు 6,025గా ఉందని కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అయితే, 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి 10 లక్షల జనాభాలో యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నదని వెల్లడించారు.
కరోనావైరస్ మహమ్మారిని అరికట్టడానికి భారతదేశం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసి నేటికి 226 వ రోజు గడుస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో అన్ లాక్ 5 కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు దేశం లో 83,13,877 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో 1,23,611 మరణాలు అనుభవించాయి. కరోనా నుండి ఇప్పటివరకు మొత్తం 76,56,478 మంది కోలుకున్నారు. దేశంలో 5,33,787 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇవి మొత్తం కేసులలో 6.42 శాతం ఉన్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అయితే, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
ఇప్పుడు నమోదవుతున్న రీతిలోనే కరోనా కేసులు నమోదైతే అతి త్వరలో నే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. యాక్టీవ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుందని స్పష్టమవుతోంది. సంక్రాంతి పండుగ లోపు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టొచ్చు.