ఇక ఆ తర్వాత ప్రస్తుతం కళాశాలలను కూడా ప్రారంభించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం కూడా శరవేగంగా కసరత్తులు చేస్తోంది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఒకవేళ పాఠశాలలు కళాశాలను ప్రారంభించిన నేపద్యంలో వసతి గృహాలను కూడా ప్రారంభించాల్సి వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు తమ సొంత ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ వసతి గృహాలలో ఉంటూ విద్య కొనసాగిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇలాంటి విద్యార్థులకు పాఠశాలలు కళాశాలలు తెరిచినప్పటికీ వసతిగృహాలు తెరవక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
అందుకే కరోనా వైరస్ జాగ్రత్తలు పాటిస్తూ వసతి గృహాలు తెరుచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇటీవలే అనుమతి ఇచ్చింది. నవంబర్ 23 వ తేదీ లోగా వసతి గృహాలు తెరవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. తొలిగా ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు.. పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో ఇంటర్ విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని సూచించింది. అయితే వసతిగృహాల్లో చేరాలనుకునే విద్యార్థులకు తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి పత్రం ఉండాల్సిందిగా నిబంధన పెట్టింది జగన్ సర్కార్. విద్యార్థులందరికీ ఈనెల 30వ తేదీ వరకు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది.