ఇలా చిరు వ్యాపారులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది దీని పేరు ఎన్పిఎస్ లీడర్స్ స్కీమ్.. దీని పేరు గతంలో ప్రధానమంత్రి స్మాల్ బిజినెస్ మాన్ ధన్ యోజన అని ఉండేది. చిరు వ్యాపారాలు చేస్తూ బతుకు బండి నడిపే వారు ఈ పథకంలో చేరడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. రిటైల్ ట్రేడర్స్ షాప్ కీపర్ స్వయం ఉపాధి పొందుతున్న వారు ఈ పథకంలో చేరడానికి అవకాశం ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల మూడు వేల రూపాయల వరకు బ్యాంక్ అకౌంట్ లో కి పెన్షన్ వస్తుంది.
దీనికోసం ప్రతినెల కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు స్కీమ్ లో చేరే వయసు ప్రతిపాదికన ఎంత మొత్తంలో చెల్లించాలి అనేది కూడా ఆధారపడి ఉంటుంది. 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు మాత్రమే ఈ స్కీమ్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఒక వేల పద్దెనిమిది ఏళ్ళ వయస్సులోనే ఈ స్కీమ్లో చేసినట్లయితే రోజుకి రెండు రూపాయలు ఆదా చేసి నెలకు 55 రూపాయలు కడితే సరిపోతుంది. 29 ఏళ్ల వయసులో ఈ స్కీం లో చేరితే వంద రూపాయలు కట్టాలి.. 30 ఏళ్ల వయసులో చేరితే 200 చెల్లించాల్సి ఉంటుంది.