సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి, జే డిగా, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు వి.వి లక్ష్మీనారాయణ.  ముఖ్యంగా జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో, ఆయనను 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. అంటే, జెడి దర్యాప్తు అధికారి గా ఎంత పకడ్బందీగా ఆధారాలను సేకరించి పెట్టారో అందరికీ అర్థమవుతుంది. ఇది ఇలా ఉంటే 2019 ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీలో చేరారు. అయితే అప్పటి వరకూ ఆయన బిజెపిలో చేరుతారని ప్రచారం జరిగినా, ఆయన ఎవరూ ఊహించని విధంగా జనసేన వైపు మొగ్గు చూపారు. విశాఖనుంచి జనసేన అభ్యర్థిగా పోటీకి దిగినా ఫలితం కనిపించలేదు.



 ఇక ఆ తర్వాత పరిణామాల్లో, పవన్ తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మరికొన్ని కారణాలు .చూపిస్తూ జనసేన నుంచి బయటకు వచ్చేశారు. ఇక ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి ఆహ్వానాలు అందినా, జేడీ మాత్రం వాటికి దూరంగానే ఉన్నారు అయితే ఇప్పుడు మాత్రం, సొంతంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ నుంచి ఆయనకు ఆహ్వానాలు అందుతున్నాయని, నామినేటెడ్ ఈ పోస్ట్ ను సైతం ఇచ్చేందుకు మొగ్గు చూపించడం, అలాగే రాబోయే ఎన్నికల్లోనూ బిజెపి విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామనే హామీ తో ఆయన బిజెపి వైపు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.


ప్రస్తుతం జేడీ స్పీడ్ చూస్తుంటే వీలైనంత తొందరలో ని బీజేపీ కండువా కప్పుకో నేల కనిపిస్తున్నారు దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్ లో మొత్తం పరిస్థితులను తమకు అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు గా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: