పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ లీడర్ ముఖ్యమంత్రి అయినా అందర్నీ విమర్శిస్తూ రాష్ట్రాన్ని సక్రమంగా తీసుకెళ్లడంలో కొంత పాత్ర వహిస్తుంటారు కొందరు.. వీరు ప్రత్యక్ష రాజకీయాల్లో పాలనా పార్టీ తరపున మాట్లాడారు.. ప్రజల తరపున మాట్లాడతారు.. ప్రభుత్వం ఎవరిదైనా తప్పు జరిగితే విమర్శించి మంచి జరిగేలా చూస్తుంటారు..  రాజకీయ పార్టీలు, ప్రజలు, తటస్థులైన రాజకీయ నేతలు, రాజకీయ విశ్లేషకులు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంటారు.ప్రజా స్వామ్య మనుగడకు విమర్శలే ప్రాణం అనే మాట వింటుంటాం. ప్రభుత్వాలు కూడా విమర్శలు సహించలేకపోతే.. వారి పరిపాలన సజావుగా సాగదంటారు. అయితే ఇలా సమాజానికి తెలియకుండా సమాజ బాగు కొరకు కృషి చేసే వారు ఏపీ లో చాలామంది ఉన్నారు.. అందులో ఒక్కరు ఉండవల్లి అరుణ్ కుమార్..

టీడీపీ, వైసీపీ, బీజేపీపార్టీ నైనా విమర్శించే అధికారం ఆయనకు ప్రజలే కల్పించారని చెప్పాలి. అయితే అన్ని విమర్శలే కాకుండా ప్రశంశలు కూడా చేస్తూ ప్రభుత్వాలని ప్రోత్సహిస్తుంటారు.. అయితే ఇటీవలే సోము వీర్రాజు ను టార్గెట్ చేసినట్లు అయన చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకు తలనొప్పిగా మారాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు.. గతంలో ఉండవల్లి నోట్ల రద్దు విషయంలో, పోలవరం విషయంలో మోడీ విమర్శించినా ఉండవల్లి బీజేపీ ని శాతం విమర్శించి జాతీయ మీడియా లో వెలుగు వెలిగారు.

రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉండవల్లి.. తటస్థుడుగా గుర్తింపు పొందారు. ఉండవల్లి విమర్శలను గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే కేంద్రంలో బీజేపీ మాత్రం ఉండవల్లి విమర్శలను.. సహించలేపోతోంది. ఆ పార్టీ ఏపీ నేతలు ఉండవల్లిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఉండవల్లిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉండవల్లి చేస్తున్న విమర్శలు ఆ పార్టీ నేతలకు ఏ స్థాయిలో చికాకు తెప్పిస్తున్నాయో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీలే కాదు ఇతరుల విమర్శలను కూడా సహించలేని పరిస్థితిలో ఉన్నట్లు సోము తీరుతో స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: