భారత్ పాకిస్తాన్ సరిహద్దు ల్లో  ఎప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు పాకిస్థాన్ సైన్యం భారత సైన్యం పై దాడులకు పాల్పడడం లాంటివి చేస్తూ ఉంటే కొన్ని కొన్ని సార్లు ఉగ్రవాదులు అక్రమంగా భారత సరిహద్దు లోకి చొరబడి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో నిత్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. ఎప్పుడు భారత సైన్యం ఉగ్రవాదుల తో పాకిస్తాన్ సైన్యం తో ఒకరకంగా ప్రత్యక్ష యుద్ధం చేస్తూనే ఉంటుంది  అని చెప్పాలి. ఏ క్షణంలో  పాకిస్తాన్  దాడి చేసిన అడ్డుకునేందుకు భారత్  అప్రమత్తంగా ఉంటుంది.




 ఇక ఈ మధ్య కాలంలో అయితే భారత్ పాకిస్తాన్ సరిహద్దు లో భారత సైన్యం ఎంతో  వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారత్లోకి అక్రమంగా చొరబడిన ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు మట్టు  పెడుతూ మరోసారి భారత్ లోకి ప్రవేశించాలంటే వణికే  విధంగా వ్యవహరిస్తోంది భారత సైన్యం. ఇక పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో రానున్న  రోజులు మరింత ఉద్రిక్త పరిస్థితులు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి.



 ప్రస్తుతం పాకిస్తాన్ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అర్ధరాత్రి సమయంలో కూడా పహారా కాస్తుంది. ప్రస్తుతం పాకిస్థాన్ అనుసరిస్తున్న వ్యూహాలు యుద్ధ  సందర్భాలలో  అనుసరించేవి  అని  ప్రస్తుతం ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. నిన్న రచ్చిక్రి  సెక్టార్  దగ్గర భారత్ పాకిస్తాన్ దళాలు ప్రత్యక్ష యుద్ధం చేశాయి. భారత్లో ఉగ్రవాదులను అక్రమంగా పంపించేందుకు  ప్రయత్నం చేస్తుంటే భారత సైన్యం నేరుగా వెళ్లి పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేసింది.  సరిహద్దు దాటి వెళ్లి మరి పాకిస్తాన్ సైన్యం పై భారత సైన్యం దాడి చేసినట్లు ప్రస్తుతం రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. కాగా  దీనిపై ధ్రువీకరణ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: