ప్రేమ అనేది ఈ మధ్య రోజుల్లో యువతకు కామన్ అయిపోయింది..చదువుల కోసం అంటూ కాలేజీలకు వెళ్ళడం తర్వాత ఏదో చేయాలని అనుకోవడం మరేదో చేయడం చేస్తున్నారు.. ఈ క్రమంలో యువత పై సినిమాల ప్రభావం ఎక్కువగా పడటంతో చదువును పక్కన పెట్టేసి ప్రేమ అనే పిచ్చిలో తిరుగుతున్నారు. అదే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ప్రేమ పేరుతో కొందరు జీవితాలను నాశనం చేసుకుంటే మరికొందరు మాత్రం పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు..




గతంలో కన్నా ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమించుకొని చెట్టా పట్టాలేసుకొని తిరగడం తరవాత కోరికలు తీర్చుకున్నాక బోర్ కొట్టడం ఎవరి దారిలో వాళ్ళు వెళ్లిపోవడం చేస్తుంటారు. మరి కొందరు మాత్రం మాది నిజమైన ప్రేమ అని భీష్మించుకు కూర్చున్నారు.. చేసుకుంటే తాము ప్రేమించిన వారినే చేసుకోవాలని అనుకుంటున్నారు.అలా చేసే క్రమంలో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే మరి కొందరు. మాత్రం ప్రేమకు పెద్దలు నో చెప్పారని తనువు చాలిస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి..




ఎంత ప్రేమించుకున్నా కూడా ఇంట్లో వాళ్ళు రానివ్వాలని అంటే ఒకటే కులం లేదా మతం అయిన ఉండాలి లేదా మతం మార్చుకోవాలి అనుకుంటారు. అలా చేస్తే వారి మతంలోకి మారడానికి అవకాశం ఉందని అనుకుంటారు..అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడుతుంది. అదేంటంటే.. పాతికేళ్ళు పెరిగిన వాతావరణం ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి. పద్దతులు వేరుగా ఉంటాయి.. మతం మార్పిడి జరిగిన కూడా 80 శాతం పెళ్లిళ్లు ఫెయిల్ అవుతున్నాయి..ఏవో పాతిక శాతం అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్తున్నారు. లవ్ జిహాద్ కిందకు బీజీపీ నేతలు భావిస్తూ, మత మార్పిడిని నిషేధిస్తూ చట్టాలను తీసుకొస్తున్నారు. మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఇప్పటికీ మత మార్పిడిని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు... వారి ప్రయత్నం ఏ మాత్రం ఫలిస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: