ఈరోజు తెలంగాణ సీఎం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా కరోనా వల్ల రాష్ట్రానికి ఆర్ధికంగా జరిగిన నష్టం గురించి వీరితో చర్చించనున్నారు. అదేవిధంగా ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ విషయంపై మధ్యంతర సమీక్ష జరుపుతారు. ఎలాగు జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించే ఆలోచిస్తూ కాలయాపన చేయకుండా...ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు మరియు సర్దుబాటు అంశాల గురించి ప్రధానంగా సమీక్షలో మాట్లాడుతారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు హాజరుకానున్నట్లు తెలియవచ్చింది. ఈ మీటింగ్ తరువాత సీఎం రేపు మంత్రులు మరియు మిగిలిన అధికారులతో సమావేశమవుతారు.
కరోనాకు సంబందించిన ప్రధాన సమావేశం తరువాత సీఎం కేసీఆర్ సాయంత్రం యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో తదితరులు పాల్గొంటారు. ముఖ్యంగా యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల్లో జరిగిన మార్పులను గురించి చర్చించనున్నారు. ప్రస్తుతమున్న ఆర్ధిక అభివృద్ధిని మరింత పెంచడానికి ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీనుకుంటారో అని ప్రజలంతా వేచిచూస్తున్నారు.