ఇప్పుడు కాదు
2019 ఎన్నికలకు ముందు నుంచి
విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
పార్టీ మారుతున్నారు అంటూ అదేపనిగా ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో అది వాయిదా పడుతూ సర్వసాధారణంగా మారిపోయింది మొదట్లో గంట వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించగా, ఆ ప్రయత్నం సైత వృధా అయింది. ఇక ఎన్నికల తర్వాత
వైసిపి ప్రభుత్వం ఏర్పడింది. ఇక ఘంటా సైతం
టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అప్పటి నుంచి టీడీపీతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.దీంతో ఆయన
పార్టీ మారడం తథ్యం అని అనుకుంటున్న సమయంలో
వైసీపీ లోకి వెళ్లేందుకు ప్రయత్నించి చివరి నిమిషంలో అకస్మాత్తుగా
జగన్ ఢిల్లీకి వెళ్లడం తో అది కాస్త వాయిదా పడింది.
టీడీపీ నుంచి అధికార పార్టీలోకి వెళ్లేందుకు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది ఆతెలుగుదేశంయన టిడిపిలో పూర్తి చేయడంతో ఇటీవల పార్టీ ప్రకటించిన వివిధ కమిటీల్లో గంటా కు ప్రాధాన్యం దక్కలేదు.ఇప్పుడు
వైసీపీ లోకి వెళ్దాము అని చూస్తున్నా వెళ్ళిన తర్వాత తనకు తగిన ప్రాధాన్యం దక్కుతుందా లేదా అనే అనుమానాలు సైతం ఆయనకు కలుగుతోంది ఎందుకంటే మంత్రిగా ఉన్న
అవంతి శ్రీనివాస రావు అడ్డుకుంటూ వస్తున్నారు. అది కాకుండా ఇప్పటికే
టిడిపి నుంచి చేరిన వారికి
జగన్ పెద్ద పీటేమీ వీలు లేదు. అంటే ఇప్పుడు టిడిపిలో ఏవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నా రో, వైసీపీలను అదేవిధంగా ఉండాల్సి వస్తుందని, తనకంటే
జూనియర్ లు తమ పై పెత్తనం చేసే అవకాశం ఉంటుందని, ఇలా ఎన్నో లెక్కలు వేసుకుంటున్నారు.
అందుకే ఇప్పుడు వైసీపీలోకి వెళ్లేందుకు ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీలోనూ ప్రాధాన్యం లేకపోవడం,
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కీలకంగా ఉన్న సబ్బం
హరి, అచ్చెన్న నాయుడు వంటి వారికే ఇప్పుడు ఎక్కువగా ప్రాధాన్యత ఉండడం వంటివి గంటాను ఆలోచనలో పడేస్తున్నాయి. అందుకే పార్టీలో ఉండలేక ,
పార్టీ మారి వైసీపీలోకి వెళ్లలేక గంటా పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. అయితే ఏదో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోకపోతే రాజకీయంగా ఎదురుదెబ్బ తినాల్సి వస్తుంది అని భయం ఆయనను ఎక్కువగా కనిపిస్తోందట.