పెద్దలకు భక్తి గీతాలు... చిన్న పిల్లలకు ఆట పాటలు.. విద్యార్థులకు చదువు.. ప్రొఫెషనల్స్ కి సమాచారం.. యువతకు ఎంటర్టైన్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. యూట్యూబ్లో దొరకనిది అంటూ ఏదీ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా రోజురోజుకు యూట్యూబ్ వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఏ విషయం తెలుసుకోవాలి అన్న ఎక్కడికి వెళ్లకుండా కేవలం యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు. దీంతో కేవలం నిమిషాల వ్యవధిలోనే కావాల్సిన సమాచారాన్ని యూట్యూబ్ వేదికగా తెలుసుకుంటున్నారు.
కాగా ఇటీవలే భారత దేశం సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలు యూట్యూబ్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోవడంతో వినియోగదారులందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు కొద్ది గంటలపాటు యూట్యూబ్ సేవలు పని చేయలేదు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి సమయంలో కొన్ని గంటలపాటు యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఎంతో మంది వినియోగదారులు సోషల్ మీడియాలో యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి అని పోస్టులు పెట్టారు. ఇక ఆ తర్వాత యూట్యూబ్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. యూట్యూబ్లో సాంకేతిక సమస్య వచ్చిందని.. ప్రస్తుతం సమస్య పరిష్కరించడం తో యధాతధంగా యూట్యూబ్ సేవలు కొనసాగుతున్నాయి అంటూ స్పష్టం చేసింది యూట్యూబ్.