కేంద్రంలో బిజెపి అధికారంలో కి వచ్చిన తర్వాత దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో వ్యూహాత్మకం గా ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి విషయం లో కూడా ఎంతో వ్యూహాత్మకం గా ముందుకు కదులుతున్న బీజేపీ ప్రభుత్వం.. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచే విధంగా సరికొత్త ప్రణాళికల తో రూపొందించిన అభివృద్ధి వ్యూహాల ను అమలు చేస్తోంది. ముఖ్యంగా  దేశంలో రహదారుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎంతో వినూత్నంగా ఆలోచించి ఆధునిక టెక్నాలజీతో కూడిన రహదారులను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.



 ఇప్పటికీ దేశంలో అధునాతన టెక్నాలజీతో కూడిన రహదారులను నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణం లో కీలకమైనటువంటి సూత్రాలు పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సహజత్వాన్ని దెబ్బతీయకుండానే రహదారుల నిర్మాణం చేపట్టేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా ఒక రహదారి నిర్మాణం చేపట్టిన తర్వాత రెండు మూడు ప్రయోజనాలు ఉండేవిధంగా కసరత్తులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.



 ఇప్పటికే ఇలా అత్యాధునిక సదుపాయాలతో కూడిన రహదారుల నిర్మాణం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు మరో అత్యాధునిక సదుపాయాలతో కూడిన రహదారి నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది. వారణాసిలో లాల్ బహదూర్ విమానాశ్రయం సమీపంలో వారణాసి లక్నో రహదారి పైనే ఫ్లై ఓవర్  రన్ వే  నిర్మించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. అంటే కింద కార్లు వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.. పైన మాత్రం విమానాలు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇలా కింద హైవే పైన రన్ వే  నిర్మించేందుకు కేంద్రం ఎంతో వ్యూహాత్మకంగా కసరత్తులు చేస్తోంది. ఒకవేళ ఈ రన్ వే  నిర్మాణం విజయవంతంగా పూర్తి అయితే దేశంలో మరికొన్ని ప్రాంతాలలో కూడా ఇలాంటి తరహా రన్ వే  నిర్మాణానికి కేంద్రం సిద్ధమయ్యే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: