అయితే ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వారంతా సినిమా టికెట్ల కోసం వేచి చూస్తున్న వారు కాదు ప్రభుత్వం అందించే పరిహారం కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండల వ్యవసాయ కార్యాలయం ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజాము నుంచి వందల మంది రైతులు ప్రభుత్వం అందించే పరిహారాన్ని తీసుకోవడానికి క్యూ కట్టారు. ఇక ఈ క్యూ కాస్త అంతకంతకూ పెరిగి పోయింది. దీంతో రైతులందరూ పరిహారం కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రైతులు అందరూ పంట నష్టపోయి అయోమయ స్థితిలో పడిపోయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం టోకెన్ విధానం అమలు చేస్తూ ఉండడంతో వరి కోయడానికి కూడా టోకెన్ తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వరి కోయడానికి ఇలా టోకెన్లు తీసుకోవడం కోసం ఏకంగా ప్రతి రోజు కూడా తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద బారులు తీరుతున్నారు రైతులు. దీంతో వరి కోయడం ఏమో కానీ పడిగాపులు మాత్రం కాయాల్సి వస్తుంది రైతులందరూ. ఇటీవలే సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ తహసిల్దార్ కార్యాలయం వద్ద రైతులు పడిగాపులు కాస్తూ టోకెన్ల కోసం వెయిట్ చేస్తున్నారు.