కరోనా వ్యాక్సిన్లపై హ్యాకర్ల కన్నుపడింది. మహమ్మారిని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు తమ పనుల్లో ఉంటే.. డేటాను చోరి చేసేందుకు రెడీ అయ్యారు హ్యాకర్లు.  ప్రముఖ ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్‌ పరిశోధకుల నుంచి విలువైన డేటాను చోరి చేసేందుకు రష్యా, ఉత్తర కొరియా హ్యాకర్లు రెడీ అయినట్లు నిపుణులు వెల్లడించారు.

కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఎంత వీలైతే అంత తొందరగా వ్యాక్సిన్ తీసుకువచ్చి కరోనా కంట్రోల్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం వ్యాక్సిన్ల ప్రయోగాలపై స్పీడ్‌ పెంచారు. అయితే, శాస్త్రవేత్తలు, పరిశోధకులు వ్యాక్సిన్‌ ప్రయోగాలు ముమ్మరంగా జరుపుతుండగా.. వీటిపై హ్యాకర్లు ప్రయత్నించింది.

భారత్‌, కెనడా, దక్షిణకొరియా, అమెరికాలోని కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలను లక్ష్యంగా చేసుకుని వీరు హ్యాకింగ్‌కు యత్నించినట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. చాలా వరకు హ్యాకర్లు విఫలమైనట్లు గుర్తించినట్లు నిపుణులు తెలిపారు. రష్యా  మిలిటరీ ఏజెంట్స్‌కు చెందిన ఫ్యాన్సీ బీర్‌, ఉత్తరకొరియాకు చెందిన లజారస్‌ గ్రూప్‌ హ్యాకింగ్‌కు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్‌ పరిశోధకులు లాగిన్‌ వివరాలను చోరీ చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలిపింది.

ఈ ఏడాది జులైలో అమెరికా ప్రభుత్వం కూడా హ్యాకింగ్‌ ఆరోపణలు చేసింది. చైనా మద్దుతు కలిగిన హ్యాకర్లు తమ వ్యాక్సిన్‌ తయారీదారులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించిన ట్రంప్‌ సర్కార్‌.. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు ప్రకటించింది. సైబర్‌ దాడుల నుంచి ప్రపంచ దేశాలు ఆరోగ్య సంరక్షణా సంస్థలకు  రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి కరోనా వ్యాక్సిన్లపై హ్యాకర్ల కన్నేసినట్టు తెలుస్తోంది. కరోనాను అంతం చేసేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలూ కృషి చేస్తున్నారు. ఎలాగైనా వ్యాక్సిన్ కనిపెట్టి ప్రజలు కరోనా మహమ్మారి భారిన పడకుండా కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే హ్యాకర్లు వక్రబుద్దిని చూపిస్తున్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్ పరిశోధకుల నుంచి విలువైన డేటాను చోరీ చేసేందుకు హ్యాకర్లు పన్నాగం పండుతుండటం ఇపుడు కలవరానికి గురిచేస్తోంది.







మరింత సమాచారం తెలుసుకోండి: