ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బరైల్ జిల్లాకు చెందిన సుహైల్ అనే 23 ఏళ్ల యువకుడు.. ఇటీవలే తన అంకుల్ ఇంటికి వచ్చాడు. ఇక నవంబర్ 15వ తేదీన అతను తన ఇంటి ఎదుట మూత్ర విసర్జన చేశాడు. ఇక దీన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు ఆ యువకుడు తో వాగ్వాదాని కి దిగారు. ఇక యువకుడు వారితో వాదించడం మొదలు పెట్టాడు. దీంతో గొడవ కాస్తా మరింత ముదిరి పోయింది. ఒక తీవ్ర ఆగ్రహావేశాల కు లోనైన ఇరుగు పొరుగు వారు ఏకంగా సోహైల్ పై చేయి చేసుకున్నారు.
అందరూ కలిసి ఒక్క సారిగా కర్రలతో మూకుమ్మడిగా దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. దీంతో గమనించిన బంధువులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీవ్ర గాయాలపాలైన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే యువకుడిపై దాడి చేసినట్లు భావిస్తున్న ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు.