అలాగని వ్యాక్సీన్లు మాత్రమే పరిష్కారం కాదు. వ్యాధి నిర్ధారణ వ్యవస్థ ఉండాలి. మరణాలను తగ్గించాలి. చికిత్సలు చేయాలి. వ్యాక్సీన్లు ఇవ్వాలి. వీటన్నింటికంటే ముందుగా ప్రజల్లో వైరస్ గురించి విస్తృత అవగాహన కల్పించి.. కనీస జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఎన్ని వ్యాక్సిన్‌లు వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదని సైంటిస్టులే చెబుతున్నారు.
అందుకే..వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ వచ్చినా అందరికీ అందుబాటులోకి ఎప్పుడు వస్తుందో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. ఒకవే వచ్చినా దాని ధర సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉంటుందా అన్నదీ ప్రశ్నార్థకమే.. అందుకే వ్యాక్సిన్‌పై ఆశలు పెట్టుకోవద్దని ఎయిమ్స్ అంతర్లీనంగా మెసేజ్ ఇస్తోంది. హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారానే వైరస్ వ్యాప్తి నిర్మూలన సాధ్యమని నమ్ముతోంది. జనంలో రోగ నిరోధక శక్తి పెరిగితే.. కరోనాను ఎదుర్కొనవచ్చని చెబుతోంది. అంటే మీ ధైర్యమే..మీ శక్తే..మీ కండపుష్టే మీ ఆయుధమని స్పష్టం చేస్తోంది. ఏదేమైనా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.